టీఎస్ పీఎస్సి లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి

 

బిస్వాల్ కమిటీ సిఫార్స్ మేరకు ఉద్యోగాలను నింపాలి

వైఎస్సార్టిపి జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ

జగిత్యాల, ఏప్రిల్ 12: నిధులు నియామకాల పేరిట సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లీకేజీల మాయమైందని టిఎస్పీఎస్సి లికేజీపై సిబిఐ విచారణ జరిపించాలని, బిస్వాల్ కమిటీ సిఫార్స్ మేరకు నిష్పక్షపాతంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని వైఎస్ఆర్టిఫి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ కోరారు. బుధవారం వైఎస్ఆర్టిఫి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరుద్యోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష్య 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ ప్రకారంగా ఉద్యోగాలన్ని భర్తీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా లీకేజీల పయనం కొనసాగుతోందన్నారు. టి.ఎస్.పి.ఎస్సి లో జరిగిన లీకేజీ అంశంపై సీబీఐ విచారణ జరిపించి నిరుద్యోగులకు విశ్వాసం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజ్ లు భారం కాకూడదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా నిరుద్యోగులకు 3 వేల 16 రూపాయల నిరుద్యోగ భృతి కల్పించాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా లో ఎస్సి, ఎస్టీ, బిసి లకు పోటీ పరిక్షలకు ప్రభుత్వం కల్పిస్తున్న సహకారాన్ని మరింతగా పెంచాలని చెదల సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టిపి జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ కోఆర్డినేటర్లు గంగాధర్, స్రవంతి ప్రేమ సాగర్, మెట్ పెల్లి డివిజన్ రైతు అధ్యక్షులు లక్ఫతి రెడ్డి తోపాటు పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking