ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ,
19 జూన్ 2024 ,
ప్రజాబలం ప్రతినిధి,
వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ పాటుపడతారని అన్నారు..

దేశంలో ఒకవైపు మతం,ప్రాంత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట విడదీయాలను చూస్తున్న బిజెపి ని దేశంలో నిలువరించడానికి పోరాటం చేస్తున్న యోధుడు రాహుల్ గాంధీ అన్నారు..

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మణిపూర్ నుంచి ముంబయి వరకు వారు చేసిన భారత్ జూడో యాత్ర ద్వారా దేశ ప్రజలను కదిలించి 400 సీట్లు రావాలన్న బిజెపిని తక్కువ సీట్లకే పరిమితం చేసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాడేల ఇతర పార్టీలపై ఆధారపడేలా చేశారన్నారు..

నా ఇష్టానుసారం దేశాన్ని ఏడూ తనని బిజెపిని తక్కువ సిట్లుకు పరిమితం చేయడం ద్వారా రాహులు గాంధీ విజయం సాధించారని,ఈ దేశానికి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూస్తామన్నారు..

గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అవకాశం వచ్చిన చేపట్టలేదన్నారు.. దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు..

రాజన్న ఆశీస్సులతో పాటు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking