వికలాంగులు అయిన కవులు, కళాకారులు, రచయితలు ఉత్తమా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మేడమ్ రామిజా బీ మెమోరియల్ అవార్డ్స్
….ఎన్ పి అర్ డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
* కె వెంకట్, ఎం అడివయ్య
సంగారెడ్డి జూన్ 19 ప్రజ బలం ప్రతినిధి:
బధిరుల ఆశజ్యోతి, కవి, రచయిత హెలెన్ కెల్లర్ 144వ జయంతి సందర్బంగా హెలెన్ కెల్లర్ విద్య సంస్థల వ్యవస్థాపకులు మేడమ్ రామిజా బీ మెమోరియల్ అవార్డ్స్ ను జూన్ 27నాడు ఇస్తున్నామని హెలెన్ కెల్లర్ విద్యసంస్థల అధినేత లయన్ పి ఉమర్ ఖాన్, ఎన్ పి అర్ డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య తెలిపారు.
ఈ రోజు నేరెడీమేట్ లోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జూన్ 27నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో NPRD, హెలెన్ కెల్లర్ విద్య సంస్థలు ఆధ్వర్యంలో లయన్ క్లబ్ అఫ్ హైదరాబాద్ హై టెక్ సిటీ సహకారంతో వికలాంగులు అయినా కవులు, కళాకారులూ, రచయితలు మరియు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ లలో ఉత్తమా ప్రతిభ కనబర్చిన వికలాంగులు అయినా విద్యార్థులకు మేడమ్ రామిజా బీ మెమోరియల్ అవార్డ్స్ ఇస్తున్నామని తెలిపారు.హెలెన్ కెల్లర్ జీవితంలో సాధించిన విజయాలను నేటి తరానికి పరిచయం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. మేడమ్ రామిజా బీ ఉన్నత చదువులు చదివి ముగా, చెవిటి వారికి చదువు నేర్పేందుకు ప్రత్యేక పాఠశాల స్థాపించినరాని అన్నారు. రామిజా బీ కృషి వలన నేడు వేలాది మంది ముగా, చెవిటి వాళ్ళు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. రామిజా బీ ఉపాధ్యాయురాలుగా పదవి విరమణ చేసిన తరువాత వచ్చే నెల నెల పెన్షన్ ను సైత్యం బధిరులు విద్య అభివృద్ధి కోసం ఖర్చు చేసినరాని తెలిపారు.జూన్ 27న జరిగే హెలెన్ కెల్లర్ 144వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ హై టెక్ సిటి అధ్యక్షులు జి వెంకట్రావు, హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూట్ రెసర్చ్ మరియు రెహబిలిటేషన్ ఫర్ ది దిశబ్లెడ్ చిల్డ్రన్స్ డైరెక్టర్ డాక్టర్ అర్ముగాం, యం శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.