ఓయూలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

 

ప్రజబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 19:
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి దశ దిశను నిర్ధేశించి తన భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజల బాధలను, కష్టాలను దగ్గరగా తెలుసుకొన్న యువ నాయకుడు ఎంపీ పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొత్తపల్లి తిరుపతి అన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ లో ఓయూ జేఏసీ, కాగ్రెస్ పార్టీ యువ నాయకులు కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్, కోలపురి చంద్ర శేఖర్ ల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకొని రాహూల్ గాంధీ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ బారత దేశ ప్రజాస్వామ్యం విలువలు మరియు బారత రాజ్యాంగం రక్షణ అనేది కాగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. మోడీ నాయకత్వం లోని బీజేపీ పార్టీ పాలనలో బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు మరియ మైనార్టీలకు రక్షణ లేదని ఆ పార్టీ వారి హక్కులను హరిస్తుందన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలందరి హక్కులు పరిరక్షించబడుతాయన్నారు. ఒక కాగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోని కాగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలను పారదర్శకంగా నింపుతుందని అన్నారు. అంతేకాకుండా యువతకు నైపుణ్యాలను పెంపొందించేందుకు అధిక ప్రాధ్యానత ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు పార్టీలో మరియు ప్రభుత్వం లో ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తుస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, ప్రవీణ్, రాజు, శ్రీనివాస్, ప్రశాంత్, కుమార్, రవి, రాజేందర్, ప్రశాంత్, సంజు నాయక్, హర్షిత్, అంజి, రంజిత్, ప్రవీణ్, మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking