-యోగా గురూజీ మచ్చగిరి నరహరి.
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 19
జమ్మికుంట పట్టణం లో నిత్య యోగ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు యోగ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందని, అదేవిధంగా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని యోగా గురూజీ మచ్చగిరి నరహరి అన్నారు. జమ్మికుంట పట్టణంలో ప్రతిరోజు ఎలాంటి రుసుము లేకుండా ప్రజల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిత్య యోగ కార్యక్రమం జమ్మికుంటలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు ప్రతిరోజు సుమారు పురుషులు 30, మహిళలు 25 వరకు హాజరవుతున్నారని వారు అన్నారు. యోగా చేయాలని ఆలోచన ఉన్నవారు ఎవరైనా తమని సంప్రదించి యోగా కార్యక్రమంలోపాల్గొనాల్సిందిగా తెలిపారు.ఈ కార్యక్రమంలో యోగా గురూజీ మచ్చగిరి నరహరి, యోగసాధకులు బచ్చు వీర లింగం, ఓల్లాల బాబి శెట్టి, అయిత యుగంధర్, గర్రెపల్లి వెంకటేశ్వర్లు, చిదురాల శ్రీనివాస్ గారు పబ్బతి రాజగోపాల్, యాంసాని సురేందర్, ఆకారపు రమేష్, ముంజాల స్వామి, రాయికంటి రవీందర్, గర్రెపల్లి రమేష్, ముస్త్యాల జగదీశ్వర్, మోహనచారి, మల్లేశం, తదితరులు పాల్గొనడం జరిగింది.