ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జులై18:
రైతు రుణమాఫీ పథకం అమలు చేసినందుకు ఓయూలో సంబరాలు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటి జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలకృష్ణ నేత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో సువర్ణాక్షాలతో లిఖించాల్సిన రోజు అని అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్గాంధీ ఇచ్చిన హామీలో భాగంగా రైతు రుణమాఫీ పథకం అమలు చేస్తూ ఒక లక్ష రూపాయల రుణమాఫీనీ ఏక కాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. మిగిలిన రుణమాఫీని ఆగస్టు 15 లోపు ఇచ్చిన హామీనీ అమలు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలిలో ఆమోదం తెలుపుతూ విధివిధానాలు ఖరారు చేయడం లక్షల మంది రైతుల కళ్ళలో ఆనందం కలిగించే విషయం అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతు రుణమాఫీ చెయ్యక అప్పుల ఉభిలో కురుకపోయి ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. మళ్ళీ ఆ చీకటి రోజులు రాకుండా ప్రజా ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం ఏక కాలంలో రైతు రుణమాఫీ పథకం అమలు చేయడం చారిత్రక నిర్ణయం అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయుడు, రాపోలు వాసు, సాయిప్రకాష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.