జాతీయ స్థాయి పంచాయతీ అవార్డ్ 2023 కు ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. జాతీయ స్థాయి పంచాయతీ అవార్డ్ – 2023 కు ( దిన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ )ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు, సన్మానం కార్యక్రమాన్ని స్థానిక దివ్యగార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ పంచాయతీ అవార్డుల కోరకు జిల్లా నుంచి 396 గ్రామపంచాయతీలలో 24 గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డుకు ఎంపిక కాగా 27 ఉత్తమ పంచాయతీ అవార్డులను సాధించినట్లు తెలిపారు.
గ్రామపంచాయతీలు సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలని,9 విభాగాలలో ప్రతీ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలని అన్నారు.
24 గ్రామపంచాయతీలు, 27 జాతీయ అవార్డులకు ఎంపికైనందున వారికి అవార్డులను, ప్రశంస పత్రాలను అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking