లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కరుకూరి సురేందర్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 25 : మంచిర్యాల జిల్లాలోని లక్షెటిపేట పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం నిర్వహించారు.బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం కారుకూరి సురేందర్ గడికొప్పుల కిరణ్ లు పోటీ చేయగా ప్రధాన కార్యదర్శి కోసం ఎస్.ప్రదీప్ కుమార్ నేరెళ్ల రాజేశ్వర్ లు పోటీ చేశారు.నూతన అధ్యక్షుడిగా కారుకూరి సురేందర్ ఎన్నికయ్యారు.గెలుపొందిన అధ్యక్షుడుకి న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.ఎన్నికల అధికారిగా గోవింద్ రావు వ్యవహరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking