తప్పుడు పత్రాలతో చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి..కొంపల్లి మున్సిపాలిటీ చైర్మైన్ సన్న శ్రీశైలం యాదవ్

(కొంపల్లి, ప్రజాబలం న్యూస్) మార్చి 25 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, కొంపల్లి మున్సిపాలిటీ.. జయభేరి ఎన్క్లేవ్ లోని 303 గజాల సెప్టిక్ ట్యాంక్ స్థలాన్ని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని అందులో నిర్మాణం చేస్తున్నారని కాలనీ వాసుల ఫిర్యాదులు అందడంతో.. అధికారులు స్థలం యొక్క పూర్తి సమాచార సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొంపల్లి మున్సిపాలిటీ చైర్మైన్ సన్న శ్రీశైలం యాదవ్ స్పందిస్తూ.. ఈ విషయం గాను శనివారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..గతంలో కొంపల్లి గ్రామపంచాయతి బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ నాగమణి భర్త జిమ్మి దేవేందర్ తప్పుడు పత్రాలతో కాలనీ లోని సెప్టిక్ ట్యాంక్ స్థలం నిర్మాణం పై వెంటనే చర్యలు తీసుకోవాలని అందుకు
డాక్యుమెంట్ల ఆధారాలు ఉన్నాయన్నారు.120/బి,149/ఎ సర్వేనెంబర్ లలో సుమారు 1100గజాల స్థలాన్ని సర్పంచ్ పదవి అడ్డుపెట్టుకుని, అప్పటి అధికారులతో తప్పుడు పర్మిషన్ లను పొంది కాలనీవాసులను ఇబ్బంది పెడుతున్నారని, కోట్ల విలువ చేసే స్థలాన్ని కైవసం చేసుకోవాలని దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
లోతుగా దర్యాప్తు చేసి క్షేత్ర స్థాయిలో తనిఖీ నిర్వహించాలని తప్పుడు పత్రాలతో చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలిఅని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking