జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్రరాజ్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 19 : మంచి ఆహారపు అలవాట్లు,శుభ్రతను పాటించడం ద్వారా పిల్లల జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు సాధించవచ్చని జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్రజ్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, మండల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఆర్.బి.ఎస్.కె. వైద్యులు, ఫార్మాసిస్టులకు ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నిర్వహించిన పాఠశాల ఆరోగ్య విద్య శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఉప వైద్యాధికారి డాక్టర్ అనితతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ… పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు, శు భ్రత పాటించడంపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన మార్పులు సాధించవచ్చని తెలిపారు.శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, వైద్యులు, సిబ్బంది మండలాలలో మిగతా పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, ఆయుష్మాన్ భారత్ పాఠశాల ఆరోగ్య కార్యక్రమం ద్వారా పిల్లలకు సృజనాత్మకత, బాధ్యతాయుతమైన ఆరోగ్యకరమైన ప్రవర్తనా జ్ఞానాన్ని అందించి వారి జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేయాలని తెలిపారు.పిల్లలకు ప్రతి రోజు తీసుకునే పౌష్టికాహారం,త్రాగునీటితో పాటు ఆహారం తీసుకునే సమయంలో పాటించవలసిన శుభ్రత,దైనందిన జీవితంలో అవలంభించవలసిన పరిశుభ్రత చర్యలపై అవగాహన కల్పిస్తూ అలవాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన టి.ఓ.టి.లు, డి.పి.హెచ్.ఎన్.పద్మ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.