-ఉమ్మడి జిల్లా జనసేన నాయకులు మాయ రమేష్
ప్రజాబలం నందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 19
మందమర్రి మున్సిపాలిటీలో అభివృద్ధి పేరిట జరుగుతున్న రోడ్లు, డ్రెన్లు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం కనిపిస్తుందని వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జనసేన నాయకులు మాయ రమేష్ మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో వాడవాల్సిన గోదావరి ఇసుకకు బదులుగా వాగులోని ఇసుకను వాడుతున్నారని తెలిపారు. 78,00000 లక్షల రూపాయలతో జిల్లా పరిషత్ పాఠశాల ఓర్రగడ్డ నుండి రైల్వే స్టేషన్ రోడ్డు వరకు నిర్మాణం జరుపుతున్న సిసి రోడ్డులో నాణ్యత లోపం బహిరంగగా కనిపిస్తుందన్నారు. ఈ సమస్య పై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ప్రజాధనంతో చేపట్టిన పనులలో ప్రజలు భాగస్వామ్యం అయి నాణ్యతతో కూడిన పనులను ప్రజలు చేపించుకోవాలని అందుకోసం ప్రజలకు జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. వీరి వెంట అసాది సురేష్, యాదగిరి, మహేందర్ లు ఉన్నారు