పోలీసు వాహనాలను తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 22 : రామగుండం పోలీస్ కమీషనరెట్ పరిధి మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసు వాహనాల పనితీరు వాటి నిర్వహణను రామగుండం పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ శ్రీనివాస్ కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ లలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల పోలీస్ వాహనాలు నిరంతరంగా వివిధ ప్రజాసేవలకు, ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజా సేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్ వాహనాల అధికారులకు కు తెలియజేశారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు.పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్,ఇంజన్ ఆయిల్,టైర్ల నిర్వహణ ఉత్తమ ప్రమాణాలను పాటించుకుంటూ డ్రైవర్లకు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర,ఏ ఆర్ ఏసీపీ సురేంద్ర,రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎమ్ టి ఓ సంపత్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking