మొబైల్ యాప్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి
22 ఆగస్టు 2024 :
గురువారం మెదక్ విద్యుత్ కాలనీలో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) మొబైల్ యాప్ పనితీరును జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో(L.R.S) ఫీల్డ్ వెరిఫికేషన్ అధికారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్
దరఖాస్తులు ప్రాసెస్ లో భాగంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకం క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ అమలు చేయాలన్నారు క్షేత్రస్థాయి పరిశీలన
మొబైల్ యాప్ ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్ అధికారులకు దరఖాస్తులు ప్రాసెస్ చేసే విధానం ప్రభుత్వ నిర్దేశించిన మూడు నెలల గడువులోపు
ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు.
ఈ రోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డిఎల్పిఓలకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం అవగాహన చేసుకున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి కరుణాకర్ డి ఎల్ పి ఓ లు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు