జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 22 : ప్రభుత్వం చేపట్టిన నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం-2024 పై ప్రజాభిప్రాయ సేకరణ ముసాయిదా బిల్లుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ నెల 23వ తేదీ లోగా https://ccla.telangana.gov.in లో,ఈ -మెయిల్ ద్వారా అయితే ror 2024-rev@telangana.gov.in లో,పోస్ట్ ద్వారా సి.సి.ఎల్.ఎ.కార్యాలయం, ల్యాండ్ లీగల్ సెల్, నాంపల్లి స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హెూటల్ ఎదురుగా,అబిడ్స్, హైదరాబాద్ -500001 పంపించవచ్చని తెలిపారు.ఈ నెల 24 వ తేదీన జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని,జిల్లాలోని మేధావులు,ప్రజలు, నిపుణులు సదస్సుకు హాజరై తమ అభిప్రాయాలు,సూచనలు అందించాలని తెలిపారు.