జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి ఆగస్టు 22
జమ్మికుంట మండలంలోని, మున్సిపల్ ఏరియాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల వైద్య సిబ్బంది డాక్టర్ ఫర్హానుద్దీన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి పరిధిలోని 17వ మరియు 18 వ వార్డులలో వైద్య శిభిరం నిర్వహించడం జరిగినది. 64 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయడం జరిగినది. 4 గురు జ్వర పీడితులను గుర్తించి వారి రక్త పూతల నమూనాలను వ్యాధి నిర్దారణ పరీక్షలకు కొరకు ల్యాబ్ కి పంపించనైనది. అదేవిధంగా జమ్మికుంట అర్బన్ ఏరియాలోని 6వ వార్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో డాక్టర్ మహోన్నత పటేల్ ఆధ్వర్యంలో వైద్య శిభిరం నిర్వహించి, 58 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది. 3 గురు జ్వర పీడీతుల రక్త పూతల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించనైనది. ఈ సందర్బంగా వార్డులలోని ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగహన కల్పించనైనది. వ్యక్తి గత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పై కూడా అవగహన కల్పించనైనది. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వార్డులలో ఉన్న పల్లె దవాఖానాలకు వచ్చి పరీక్షలు చేహించుకోవాలని వార్డ్ ప్రజలకు తెలియజేయనైనది. వైద్య శిబిరములలో అసంక్రిమిత వ్యాధులు అనగా బిపి మరియు షుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ మహోన్నత పటేల్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్ అరుణ, వార్డ్ కౌన్సిలర్ శ్రీపతి నరేష్, ఏఎన్ఎం లు వాణిశ్రీ, మంజుల, రజిత, ఆర్పీ లత మరియు యాదమ్మ, జయలక్ష్మి, సుజాత, రహిమాతున్నిసా, వార్డ్ లలోని ప్రజలు పాల్గొన్నారు.