మందమర్రిలో అజ్ని ట్రేన్ హల్టింగ్ పై హర్షాతిరేకాలు

-ఎంపీ ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలభిషేషకం

ప్రజా బలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చ్ 7 :

మందమరి రైల్వేస్టేషన్ లో కాజీపేట టు బల్లర్ష ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు స్టాప్ నిలుపుదలకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చినందుకు పరిషయ వ్యక్తం చేస్తూ గురువారం కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో ఎంపీ ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ట్రైన్ ను రద్దు చేయడంతో మందమర్రి పట్టణ మండల పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. బెల్లంపల్లి రవీంద్రఖని రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలు ఎక్కి ప్రయాణాలు కొనసాగించడం జరిగిందని అన్నారు..సమస్యపై కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింగ్ గారి ఆధ్వర్యంలో శ్రీపతినగర్ బస్తీ పెద్దమనుషులు – కాంగ్రెస్ పార్టీ నాయకులు – ఆటో డ్రైవర్లు
ఈ రైలు మందమర్రి రైల్వేస్టేషన్లో హాల్టింగ్ కోసం పలుమార్లు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కి. పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.ఇట్టి సమస్యపై వంశీకృష్ణ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నీ కలిసి మందమర్రి రైల్వేస్టేషన్లో కాజిపేట టు బల్లర్ష రైలు హాల్టింగ్ ఇప్పించడం జరిగిందన్నారు. పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ ప్రత్యేకంగా చోరవ తీసుకొని మందమర్రి రైల్వేస్టేషన్లో సింగరేణి ప్యాసింజర్ హాల్టింగ్ ఇప్పించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
కుండే రామకృష్ణ, భోగి వెంకటేశ్వర్లు, పోలు సంపత్, రామసాని సోమయ్య, కిష్టయ్య, శనిగారపు చంద్రయ్య, కోల రాజిరెడ్డి, అన్న మదనయ్య, రామసాని సురేందర్, సముద్రాల సంపత్, ఎనగందుల వెంకన్న, చింతల రాజులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking