-కలెక్టర్ వినతి పత్రం అందజేసిన మైనారిటీ నాయకులు
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 7:
రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరుతూ గురువారం బిఆర్ఎస్ మైనారిటీ సెల్ స్టేట్ సెక్రటరీ ఎం.డి అబ్బాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కుమార్ దీపక్ నికలిసి వినతి పత్రం అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మజీదులకు రంగులు వేయడానికి ఆర్థిక సాయం అందించాలని ప్రతినెల వేతనాలు రావడం లేదని వాటి సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఇచ్చేవారని గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముస్లింలకు అందించాలని వారు విన్నవించారు. వీరి వెంట ఎం. డి నసీరుద్దీన్, ఎం. డి ఫిరోజ్, ఎం.డి మజార్ సలావుద్దీన్, ఎం.డి ఖాజా మైనొద్దిన్ లు ఉన్నారు.