ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందించాలి

-సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 7:

చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీ గుత్తదారుపల్లె ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇప్పించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నీ కలిసి వినతి పత్రం అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ లో వ్యవసాయ భూములు ఇండ్లు కోల్పోయిన వారిని అప్పటి ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఎన్నిసార్లు ఆఫీసులో చుట్టూ తిరిగిన పట్టించుకోకుండా కాలయాపన చేసిందన్నారు.RC.NO.
B/162/2015, 2015 సంవత్సరంలో అప్పటి తాహసిల్దార్, ఆర్డీవో ఎంక్వయిరీ చేసిన లిస్టు మరియు ఆర్.సి నెంబర్ బి /397/2017 , 2017అప్పటి మరో తహసీల్దార్, అర్. డి. ఒ, ఎంక్వరీ చేసిన ఇప్పటి దాకా నష్ట పరిహారం అందలేదన్నారు,అంతే కాకుండా నష్టపరిహారం చెల్లించకుండానే ఇండ్లను కులగొట్టారని, నిర్వాసితులను బెదిరిస్తూ తాత్కాలికంగా సింగరేణి క్వార్టర్స్ కేటాయిస్తూ దళితులైన అందర్నీ బెదిరిస్తూ ఇండ్లు ఖాళీ చేపిస్తున్నారన్నారు.కాబట్టీ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి, సింగరేణి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ముడిమడుగుల రాజేందర్, కొండ రామకృష్ణ, జూమ్మిడి కిష్టయ్య, సల్లూరి విజయలక్ష్మి, కోట పోచమ్,జాడీ లక్ష్మి, కోట మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking