రైతులను గాలికి వదిలేసి విదేశాల్లో సేద తీర్చుకుంటున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి డాక్టర్ రాజా రమేష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 25 : మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గo,కోటపల్లి మండలం కొనుగోలు కేంద్రాల నుండి వడ్లను తరలించడంలో జాప్యం జరుగుతుందని మళ్ళీ వర్షం పడితే రైతులు మరింత నష్టపోతారని గమనించిన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెన్నూర్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్న ఆదేశాల మేరకు కోటపల్లి మండలం బబ్బెరచిలక, దేవులవాడ గ్రామాల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ మరియు కోటపల్లి నాయకులు. డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ… చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రైతులను ఎండకు,వానకు,గాలికి వదిలేసి విదేశాల్లో సేద తీర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్యంలో చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్న తండ్రి ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నకూడా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సకాలంలో వడ్లు కొనుగోలు కేంద్రాల నుండి తరలించి రైతులకు న్యాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నియోజకవర్గానికి వచ్చి రైతులకి న్యాయం చేసేలా లేడనీ కనీసం అధికారులైన మళ్ళీ వర్షాలు పడకముందే వడ్లను కొనుగోలు కేంద్రాల నుండి లారీల ద్వారా తరలించి రైతులకి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. మీకు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది అలాగే రైతులకి న్యాయం జరిగేవరకు అధికారుల వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని,కాంగ్రెస్ ప్రభుత్వం వెనక పడుతుంది అని హెచ్చరించారు.రైతు మాట్లాడుతూ…కంట తడి పెట్టిన సందర్భాన్ని గుర్తుచేశారు. చివరిగా అధికారులకు మరీ ముఖ్యంగా జేసికి,డిసిఎస్ఓకి, డియం లకు మిల్లర్లకు సహృదయంగా వేడుకుంటున్నాను దయచేసి రైతులకు అండగా ఉందాం, రైతులకు న్యాయం చేద్దాం, రైతులను కాపాడుకుందాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ సాంబ గౌడ్,మాజీ సర్పంచ్ గోనె సత్యనారాయణ రావు,మండల యూత్ అధ్యక్షులు మారిశెట్టి విద్యాసాగర్,ఉపాధ్యక్షులు అసంపల్లి సంపత్ కుమార్, నాయకులు సందీప్ రెడ్డి, దుర్గు మల్లయ్య,బాపు,అనిల్ గడ్డి, శంకర్,మధుకర్,యోగానంద్, చకినారపు అజయ్,తదితరులు పాల్గొన్నారు.