కల్తీ విత్తనాలపై జాగ్రత్త వహించాలి
వ్యవసాయ అధికారి సంతోష్ కుమార్.
తూప్రాన్ మే 25 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్, ఇమాం పూర్ గ్రామాల్లో వానాకాలం సీజన్ లో సాగుచేసే పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ వారు “విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు” అనే అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్ కుమార్ రైతులకు మార్కెట్లో అమ్మకానికి పెట్టే విత్తనాలను కొనేముందు పాటించవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
లూజుగా ఉన్న సంచులలో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయొద్దని,
విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత దుకాణం నుండి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని, విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలని, లైసెన్సు ఉన్న వ్యాపారస్తుల వద్దనే విత్తనాలు ,ఎరువులను కొనుగోలు చేయాలని తూప్రాన్ మండల
ఏ ఈ వో సంతోష్ కుమార్ రైతులకు సూచించారు.