కూకట్ పల్లి జనసేన పార్టీ ఆఫీస్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి .

 

కూకట్పల్లి (ప్రజబలం ) ఏప్రిల్ 03 :
ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి ని పురస్కరించుకొని కేపీహెచ్ బి 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ లో కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మా రెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి ఏప్రిల్ 3 న, మరాఠా యోధుడు రాజు యుద్ధభూమిలో శౌర్యసాహసాలకు గుర్తుగా జరుపుకుంటారు అని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నైపుణ్యం కలిగిన నాయకుడు వీర యోధుడు. అతను గెరిల్లా యుద్ధంలో నిపుణుడు రహస్య సైనిక కార్యకలాపాలను ప్లాన్ చేశాడు అని ,అతని రహస్య యుద్ధం కారణంగా అతన్ని తరచుగా పర్వత ఎలుక అని పిలుస్తారు అని అన్నారు.శివాజీ మహారాజ్‌కి రామాయణం మహాభారతం గురించి చాలా తెలుసు ఆసక్తిగల పాఠకుడు, అతను ఎటువంటి అధికారిక పాఠశాల విద్యకు హాజరు కాలేదు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్ , భోగాది వెంకటేశ్వరరావు ,వేముల మహేష్ , కాలిగినీడి ప్రసాద్ ,ఆత్మురి మోహన్ , పాదం సూర్య , మండల రమేష్ ,శేఖర్ ,మారుతి ,పులగం సుబ్బు ,వీరమహిళ యాళ్ల శిరీష తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking