వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పు సతీష్
బస్టాండ్ నుండి శివాజీ చౌక్ వరకు ర్యాలీ
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 19 : బహుముఖ ప్రతిభశాలి, బహుజన మహావీరుడు, లౌకిక వాది, మరాఠ చక్రవర్తి ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పు సతీష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వాన్ని పాటించింది శివాజీ చక్రవర్తి మాత్రమే అన్నారు. శివాజీ యూత్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ తీసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండలంలోని కొమ్ముగూడెంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాల నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో ఛత్రపతి అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు.