ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు లకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిన కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్.

 

మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్ అభివృద్ధి పథంలో భాగంగా 15వ వార్డు తూప్రాన్ కింది వాడకట్ తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ రామునీ గారీ శ్రీశైలం గౌడ్ గారితో కలిసి 70లక్షల డ్రైనేజీ సిసి రోడ్డు పనులను మున్సిపాలిటీ చైర్మన్ రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధి కి గడ నిధుల నుండి 22 కొట్లు నిదులిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు , మంత్రి హరీష్ రావుకు, ప్రత్యేక ధన్యవాదాలు క్రుతజ్ణతలు తెలిపారు.
దేశంలోనే అభివృద్ధి పథంలో తూప్రాన్ మున్సిపాలిటీ నెంబర్వన్ గా అవుతుందని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మనం పుట్టడం అదృష్టమని , దేశంలోనే గజ్వేల్ నియోజకవర్గం మొదటి స్థానం అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో నిలబడుతుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారన్నారు, తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు అందరూ ఐక్యమత్యంతో అభివృద్ధిని సాధించుకోవాలని మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్
తెలిపారు.

తూప్రాన్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే ఆకుపచ్చ, ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని, మీ వార్డ్ లో ఏమన్నా సమస్యలు ఉంటే నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు అని, మున్సిపాలిటీ అభివృద్ధికి అందరు సహకరించాలని మెదక్ జిల్లా ఉమ్మడి తూప్రాన్ తెలంగాణ ఉద్యమ రథసారథి కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్
తెలిపారు. ఈ కార్యక్రమం లో తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ , కమిషనర్ మోహన్ ఏఇ సాయిరాం రెడ్డి, కౌన్సిలర్ లు మామిడి వెంకటేష్, మామిండ్ల జ్యొతి క్రుష్ణ, వెంకటేష్ గౌడ్, నాయకులు బాయికాడి ఆంజనేయులు,గడ్డం వెంకటేశ్,

15వ వార్డు సభ్యులు గ్రామస్తులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking