బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్

 

జగిత్యాల, మార్చి 18: జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జగిత్యాల కు చెందిన డా. తోడేటి శ్రీకాంత్ గౌడ్ ను నియామిస్తు జాతీయ అద్యక్షులు జాజాల శ్రీనివాస్ గౌడ్ శనివారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసిల సమస్యల నిరంతర పరిష్కారానికి నిరంతర కృషి చేయాలని సూచించారు. బిసిల సమస్యల పరిష్కారామే లక్ష్యంగా పనిచేస్తానని తన నియామకానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి గాజుల నాగరాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఓరుగంటి భార్గవ్ రామ్, జగిత్యాల జిల్లా కార్యదర్శి శంకర్, తెలంగాణ రాష్ట్ర మహిళా నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking