ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో శనివారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అధ్యక్షతన ముందస్తు అంచనా బడ్జెట్ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పట్టణ నిర్వహణ,నీటి సరఫరా నిర్వహణ తదితర ఖర్చులు పెరిగి నందున ఆదాయ వనరులు పెంపొందించు కొనుటకు పలు సూచనలను చేశారు. ఈ సందర్బంగా సభ్యులు ముక్త కంఠంతో ఏకగ్రీవంగా 2023-24 ముందస్తు అంచనా బడ్జెట్ ను ఆమోదించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ సి వి ఎనే రాజు,ఇంజినీర్ నాగేశ్వరరావు, కౌన్సిలర్స్,తదితరులు పాల్గొన్నారు.