మర్డర్ కేసును చేదించిన పోలీసులను అభినందించిన డీఎస్పీ యాదగిరి రెడ్డి.

 

మెదక్ తూప్రాన్, మార్చి 18 ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ డిఎస్పి విలేకర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం డిఎస్పి యాదగిరి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫిర్యాదురాలు మన్నే పద్మ భర్త ఆంజనేయులు, గ్రామం అల్లాపుర్, తూప్రాన్ మండలం ప్రస్తుత నివాసం గజ్వేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివంపేట్ ఎస్ ఐ రవికాంత్ మిస్సింగ్ కేసు నమోదు చేసి, ఆచూకీ కోసం వెతుకుచుండగా గత సోమవారం నాడు ఆంజనేయులు మృతదేహం దొంతి శివార్లోని కుందాలమ్మ చెరువు వద్ద గాయాలతో లభించగా, నేరపరిశోధన చేయగా నేరస్థుడు అయిన గుండగళ్ల బాబు అలియాస్ బాల్ రెడ్డి తండ్రి శంకరయ్య, వయస్సు 23 సంలు కులం యస్. సి మాదిగ, వృత్తి ఆటో డ్రైవరు, లేబర్, ప్రస్తుత నివాసం కానుకంట గ్రామం, గుమ్మడిదల మండలం గత శనివారం నాడు మృతుడు, నేరస్థుడు కలిసి ఒకే స్తలములో ఉన్నట్లుగా తెలియగా తారీకు 18 శనివారం నాడు నేరస్థుడు అయిన గుండగళ్ల బాబు అలియాస్ బాల్ రెడ్డి ని ములుగు వద్ద అదుపులోనికి తీసుకొని విచారించగా మృతుడు ఆంజనేయులు గతంలో తీసుకున్న డబ్బు 96,000 నేరస్తునికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టుచున్నాడని విసిగి పోయి మృతుణ్ణి చంపాలని భావించి, పథకం ప్రకారంగా గత 11 వ. తారీకు శనివారం సాయంత్రం దొంతి గ్రామ శివార్లోని కుందాలమ్మ చెరువు వద్దకు తీసుకు వచ్చి అక్కడ మద్యం సేవించి ఆంజనేయులు మద్యం మత్తులో పడిపోగా అక్కడే ఉన్న బండ రాయితో నేరస్థుడు ఆంజనేయులు తల పైన కొట్టి చంపేసి, చెరువులో పడవేసి మృతుని వద్ద నుండి నోకియా సెల్ ఫోన్, బజాజ్ ప్లాటినా మోటార్ సైకల్ టీఎస్. 07ఇ. కె0172 ను తీసుకొని వెళ్ళి ములుగులోని అతని స్నేహితుడి ఇంటి వద్ద దాక్కొని ఉండగా శనివారం రోజున వెళ్ళి నేరస్థున్ని అదుపులోనికి తీసుకొని, అతని వద్ద ఉన్న మృతుని యొక్క సెల్ ఫోన్ మరియు మోటార్ సైకల్ ను స్వాధీనం చేసుకోనైనధి. ఈ కేసుని ఛేదించిన సీఐ శ్రీధర్, ఎస్ఐ రవీకాంత్ ను మరియు సహకరించిన పొలిస్ సిబ్బందికి అభినందనలు తెలియ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking