ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ముధోల్ మండల కేంద్రంలోని ఎల్విప్రసాద కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం గ్లాకోమా కంటి జబ్బుపై అవగాహన కల్పించడంలో భాగంగా ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి నుండి బస్టాండ్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అన్ని అవయవాల్లో కళ్ళు ముఖ్యమైనవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గ్లాకోమా కంటి పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్లోకోమా నిపుణులు డాక్టర్ సుకన్య, సత్యనారాయణ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సువర్ధన్, ముధోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఎస్సై తిరుపతి, ఆసుపత్రి పర్యవేక్షకులు సందీప్ రావు, ఎల్విపి సిబ్బంది, వైద్యసిబ్బంది, టిబి సూపర్వైజర్ లాలయ్య, ఆశావర్కర్లు, అంగన్వాడి సిబ్బంది, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.