ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిర్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వరం ప్రకటించారు.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 05 : మంచిర్యాల హైటెక్ సిటీలోని జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థిని తమకు సొంత భవనం లేదని అద్దె భవనంలో ఉంటున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెల్లగానే సొంత భవనం కు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ వసతి గృహాల మెస్ చార్జీలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్ కు వెళ్ళి ముఖ్యమంత్రి ని కలిసి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తమకు సొంత భవనం లేదని చెప్పగానే స్పందించారు.సొంత భవనంకు స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశిస్తానని చెప్పారు.అంతే కాకుండా భవనం నిర్మాణం కు నిధులు కేటాయిస్థానని భరోసా ఇచ్చారు.గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు.తమ ప్రభుత్వం విద్యారంగం పురోగతి కోసం కట్టుబడి ఉందని అన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఉపాద్యాయుల బదిలీలు వివాదం లేకుండా జరిపామని, పదోన్నతులు కల్పించామని,సిబ్బందిని నియమించామన్నారు.విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.విద్యార్థులు గంజాయి,డ్రగ్ తెలుపారు.రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,మాజీ వైస్ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ లు ముత్యాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు వెంగళ్ రావు,వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking