తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత
ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 05 : లక్షెట్టిపేట పట్టణంలోని తహసీల్దార్ ఆఫీస్ లో గల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ డిమాండ్ చేసింది. మంగళవారం సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ… తహసీల్దార్ కార్యాలయానికి మండలంలోని పలు గ్రామాల ప్రజలు వారి పనుల నిమిత్తం ఆఫీసుకు వస్తుంటారని , ఆఫీసులో కనీసం తాగునీరు,మూత్రశాలలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకొన్నట్లయితే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేదరి దేవవరం, రాచర్ల రవి కిరణ్, లింగాల భానుచందర్, తదితరులు పాల్గొన్నారు.