సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మరియు జిల్లా అధికారులు

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 10:
హైద్రాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతకుమారి, త్రాగు నీరు సరఫరా, పాఠశాలల మరమ్మత్తులు, సమ్మర్ యాక్షన్ ప్లాన్, ధాన్యం కొనుగోళ్ళు, సిఎంఆర్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల,పై దిశ నిర్దేశం చేశారు,
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అభిషేక్ అగస్త్య , విజేందర్ రెడ్డి సంబంధిత అధికారులతోకలిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అన్ని పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ లు ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్స్ సెర్ఫ్, డి ఆర్ డి ఏ ద్వారా చేయించడం జరుగుతుందని తెలిపారు. ఎస్టిమేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. త్వరలో గ్రౌండింగ్ పూర్తవుతుందని కలెక్టర్ సి ఎస్ కు వివరించారు. గుర్తించిన ప్రభుత్వ పాఠశాలలో అత్యవసర పనులు వచ్చే విద్యా సంవత్సరంలోపు పూర్తిచేయాలనీ కోరారు.జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో, త్రాగునీరు అందించే వనరులను గుర్తించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తాగునీరు సరఫరా చేయాలన్నారు,
ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ప్రారంభించిన సెంటర్స్ ల్లో ధాన్యం కొనుగోలల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండాచర్యలు తీసుకోవాలని, సిఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు,
ఎండ కాలంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు అవసరమైన విధంగా ప్రణాళిక ప్రకారం వైద్య ఆరోగ్యశాఖ అందించాలని, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు,
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఈవో విజయ్ కుమారి, డిఆర్డిఏ పిడి సాంబశివరావు,డిపిఓ వెంకయ్య , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రఘునాథ స్వామి సంబంధిత అధికారులు
పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking