కీసర శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకొన్న ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్రెడ్డి

 

వేదమంత్రోచ్చారణలతో ఘనంగా స్వాగతం పలికిన అర్చకులు, కలెక్టర్ అమోయ్ కుమార్

ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్మితా సబర్వాల్, రాజశేఖర్రెడ్డి

కీసర ఆలయం వద్ద ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ను అభినందించిన స్మితా సబర్వాల్, రాజశేఖర్రెడ్డి

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 18: మహాశివరాత్రిని పురస్కరించుకొని మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కీసర గుట్ట శ్రీరామలింగేశ్వరస్వామిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్రెడ్డిలు దర్శించుకొన్నారు. శనివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకొన్న వారికి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్, రాజశేఖర్రెడ్డిలు రామలింగేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వసతులను జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, రాజశేఖర్రెడ్డిలకు వివరించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు, సౌకర్యాలు చేయడం పట్ల వారు కలెక్టర్ అమోయ్ కుమార్ను అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జాయింట్ కమీషనర్ అఫ్ పోలీస్ సత్యనారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవి, డీసీపీ జానకీ,ఏసిపి .వెంకటరామిరెడ్డి ఆలయ కమిటీ ఛైర్మన్ రమేశ్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking