వరంగల్ ప్రతినిధి ప్రజాబలం ఫిబ్రవరి 18:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్టేషన్ రోడ్డులోని ఆకారపు వారి గుడి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు లంక శివకుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, బిల్వ అర్చనల తో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ ఫౌండర్ ఆకారపు హరీష్ స్వాతి దంపతులు విచ్చేసి స్వామివారిని పంచామృత అభిషేకాలతో అర్చించి ఆరాధించారు. ఉదయం నుండి కొనసాగిన పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి అభిషేకాలతో పూజలు నిర్వహించి తరించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్ని వసతులను ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ వెంకట్రావు దగ్గరుండి పర్యవేక్షించారు.