-మానవ సంబంధాలను గుర్తు చేసేదే చిరుతల రామాయణం
-మానవజాతికే అన్నదమ్ములంటే రామలక్ష్మణులు
-పండగ వాతావరణంలో జ్యోతి ప్రజ్వలన.
-సాంప్రదాయ పద్ధతిలో పుస్తేమట్టెలు అందజేసిన జనకుడు.
-జై శ్రీ రామ్ నామస్మరణతో మారుమోగిన జగ్గయ్యపల్లి.
జమ్మికుంట రూరల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 4
మానవ సంబంధాలను గుర్తు చేసేదే చిరుతల రామాయణమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు అన్నారు.బుధవారం జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామంలో శ్రీ చిరుతల రామాయణ నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు,జగ్గయ్యపల్లి మాజీ సర్పంచ్ వంశీధర్ రావు,రామాయణ కళా గురువు కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య ఉపాధ్యక్షుడు బోళ్ళ కొమురయ్య, శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి చిరుతల రామాయణాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ రామాయణం మనుషుల సంబంధాలను పూర్తిగా వివరిస్తుందని,5 రోజుల పాటు జరిగే ఈ చిరుతల రామాయణం చూసిన ప్రతి ఒక్కరు అన్నదమ్ముల అనుబంధాన్ని,తండ్రి కొడుకుల మమకారాన్ని భార్యాభర్తల అనుబంధాన్ని గుర్తు చేస్తాయని, అలాంటి బంధాలను అర్థం చేసుకొని జీవితంలో అందరూ కలిసి మెలిసి ఉండలని హితవు పలికారు.
భర్త మాట జవదాటని సీతాదేవి స్త్రీలకు ఆదర్శమని.జానెడు భూమి కోసం అన్నదమ్ములు కొట్టుకునే ఈ రోజుల్లో రామ-లక్ష్మణుల అనుభందం మానవజాతికే ఆదర్శమన్నారు.రామలక్ష్మణులు తండ్రి మాటలు జవదాటరని,నేటి కాలంలో యువకులు తండ్రి ముందే సిగరేట్,మందు తాగుతున్నారని, మొబైల్స్‌తో పూర్తిగా యువత చెడిపోయిందన్నారు.ఈ చిరుతల రామాయణాన్ని పూర్తిగా వీక్షించిన తర్వాత కొంతమంది మారిన కూడా సమాజం బాగుపడుతుందని సూచించారు.అనంతరం జగ్గయ్యపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వంశీధర్ రావు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వారికి ఉన్న బిజీ లైఫ్ లో కూడా తమ పనులను పక్కన పెట్టి ఒక నెలరోజులపాటు చిరుతల రామాయణం నేర్చుకొని గ్రామ ప్రజలు సుమారు 30 మంది రామాయణాన్ని నేర్చుకొని అద్భుతంగా ప్రదర్శిస్తున్నందుకు చిరుతల రామాయణ భక్తులను అభినందించారు.గురువులు మాట్లాడుతూ సమాజంలో నేటి కాలంలో అంతరించిపోతున్న మానవ సంబంధాలు వాటి మనుగడ పట్ల ఆధునిక ఈ టెలిఫోన్ యుగానికి ఎలా నడుచుకోవాలో,అలనాడు రాముడు నడిచిన బాటలో అందరూ నడిచే విధంగా రామాయణం ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
ప్రపంచంలో రాముడు చూపిన బాటలో నడిస్తే అందరూ సన్మార్గంలో ముందుకు వెళ్తారని అన్నారు.శ్రీ చిరుతల రామాయణ నాటక ప్రదర్శనలో మొదటి రోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని బుధవారం రోజు నిర్వహించారు.గ్రామంలోని 30మంది వరకు వివిధ పాత్రల్లో వేశాధరణ చేసి నాటిక ప్రదర్శనను కళ్లకు కట్టినట్టు పద్యాలు పలుకుతూ ప్రదర్శించారు.గురువారం సీతమ్మ అపహరణ శుక్రవారం వాలిసుగ్రీవుల వద,శనివారం రావణబ్రహ్మ వద ఆదివారం ఉదయం సీతారామల పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం ప్రదర్శన ఉంటుందని జగ్గయ్యపల్లి శ్రీ చిరుతల రామాయణ భక్తులు తెలిపారు..నాటిక ప్రదర్శన చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 500మందికి పైగా హాజరయ్యారు..ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సమైక్య శాఖల అధ్యక్షులు,ఉపాద్యక్షులు,జిల్లా నాయకులు,వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున రామాయణ కళాకారులు,భక్తులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.