– ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రాక
– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హపీజ్ మోల్సాబ్
మెదక్ పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ దగ్గరలోని క్రిస్టల్ గార్డెన్స్ లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేయనున్న ఇప్తార్ విందును విజయవంతం చేయాలని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హపీజ్ మోల్సాబ్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్తార్ విందుకు భారీ సంఖ్యలో మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరులు హాజరు కావాల్సిందిగా కోరినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మందుగుల గంగాధర్, తాహేర్, సాధిక్, అమీర్, లహిక్, మోజంమిల్ లు పాల్గోన్నారు.