క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా డిసెంబర్23:హన్మకొండ 53వ డివిజన్ లష్కర్ సింగారంలోని బెతేల్ బాప్టిస్ట్ చర్చిలో శనివారం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్ సోదరి,సోదరమనులకు క్రిస్టమస్ గిఫ్ట్ ప్యాకెట్స్ పంపిణి చేసారు.అనంతరం కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరి సోదరి మనులకు ముందస్తుగా నాయిని రాజేందర్ రెడ్డి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిష్టమస్ సందర్భంగా పేదలకు క్రిస్మస్ కానుకలు పంపిణి చేయాలని ఆదేశించారు అని తెలిపారు.అందులో భాగంగా లష్కర్ సింగారంలోని బెతేల్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ కానుకలు పంపిణి చేయడం చాలా అనందకరంగా ఉంది అని అన్నారు.నేను ఎప్పుడు ఈ ఏరియాకి వచ్చిన,చర్చికి వచ్చిన ఇక్కడ ప్రజలు నన్ను చాల ఆదరించారు.దేవుడి కృప వలన ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని,ప్రతి ఒక్కరు ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అన్నారు.ఆ ఏసుక్రీస్తు దీవెనలు ఎల్లపుడు మనతో ఉండాలని మీ ఇంట ఆనందాలు నిండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేద వారికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు బాబా భాయి,కార్పొరేటర్ గా పోటి చేసిన అభ్యర్థి ఎర్ర కావ్య, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎర్ర మహేందర్,మాజీ కార్పొరేటర్ కూర సురేందర్,బెతేల్ బాప్టిస్ట్ చర్చి ప్రెసిడెంట్ వై.అబ్రహం,చేపురి శ్యాం, ఎర్ర చందు,ఎర్ర ప్రనయ్,కే.రాజేష్. దామెర శంకర్,ఎర్ర అబ్రహం,మైనారిటీ డిపార్టుమెంటు ఈ.డి.శ్రీనివాస్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking