ఆగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి

 

-జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి

-అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా డిసెంబర్23:మినీ మేడారం అని పిలువబడే ఆగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పై శనివారం ఆత్మకూరు మండలం అగ్రంపాడులోని శ్రీ సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.సమావేశానికి ముందుగా ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అనంతరం సమ్మక్క-సారమ్మ గద్దెలను దర్శించుకుని పూజలు నిర్వహించి పూజారులు వారిని సత్కరించి సన్మానించారు.ఫిబ్రవరిలో జరిగే జాతరలో ప్రజలు ఇలాంటి ఇబ్బందులకు గురికాకుండా సౌకర్యాలు కల్పిస్తున్న తీరును శాఖల వారిగా అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.గత జాతరలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకొని అవి తిరిగి పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించారు.ఏ పనులకు ఎంత మొత్తం నిధులు అవసరం ఉంటాయో డిటిఅర్ లు తయారుచేసి సంబంధిత పై అధికారులకు పంపాలని కోరారు.అవసరమైన నిధులను సమకూర్చేందుకు కలెక్టర్ వద్దకు వెళ్లి మంజూరు చేయిస్తామని అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు చేస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు.అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడకూడదని నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తిచేసి మంచి పేరు అధికారులు తెచ్చుకోవాలని అన్నారు.కాంట్రాక్టు తీసుకున్న వారే పనులు పూర్తిచేసే బాధ్యతను తీసుకోవాలని,సబ్ కాంట్రాక్టర్లు ఉంటే చర్యలు తీసుకుంటామని అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking