రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకెళతాం”

 

– ప్రధాన సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

– ప్రభుత్వ ఆలోచనలను అనుగుణంగా జిల్లా యంత్రాంగం,అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పని చేయాలి

– వారం రోజులోనే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు ను అమలు చేశాం

– 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం.

– ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల 23, డిసెంబర్ 2023 ప్రజాబలం ప్రతినిధి

క్షేత్ర సమస్యల పై అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ తెలిపారు.

ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పనిచేయాలని కోరారు.

 

శనివారం సిరిసిల్ల IDOC కాన్ఫరెన్స్ హల్ లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రామీణభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, సెస్, రహదారులు, భవనాలు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాలు, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ప్రగతి నివేదికను సభ్యుల ముందు ఉంచారు. సభ్యులు పలు అంశాలను లేవనెత్తగా వాటికి అధికారులు వివరణ ఇచ్చారు.

ఎమ్మెల్యే గా గెలుపొందిన తర్వాత తొలిసారి శ్రీ ఆది శ్రీనివాస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశ అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ….

దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా జిల్లాలోని ఏ ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. గతంలో తాను చందుర్తి జెడ్పిటిసి సభ్యుడిగా పనిచేసిన సమయంలో అనేక క్షేత్రస్థాయి సమస్యలను అప్పటి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. జెడ్పిటిసిలు, ఎంపీపీ లు తమ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశాన్ని వేదికగా ఉపయోగించుకోనీ మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, ప్రాంత సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. ఏవైనా ముఖ్య సమస్యలు ఉంటే సర్వసభ్య సమావేశం పెట్టే వరకూ వేచి చూడకుండా , తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ తెలిపారు.
పల్లెలలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందనీ, స్నేహపూర్వక వాతావరణంలో
స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలి అన్నారు. ప్రభుత్వం కొలువుతీరిన
వారం రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు వంటి ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పినా ఆయన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు.

అభివృద్ధి, సంక్షేమం రెండ్లు కళ్ళలాగా ప్రభుత్వం భావిస్తున్నందున ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రభావంతంగా అమలయ్యేలా జిల్లా అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ అన్నారు.

ఈ సందర్భంగా
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి మాట్లాడుతూ…
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా అధికారులు పరిష్కారం చూపాలన్నారు. మండలాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంపీపీలు, జడ్పిటిసిలతో సహా స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులు తప్పనిసరిగా సమాచారం అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అలసత్వం చూడకుండా వెలువంటనే పరిష్కారం చూపాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అధికారులకు సూచించారు.

సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి,
ముస్తాబాద్ జడ్పిటిసి నరసయ్య, వీర్నపల్లి జడ్పిటిసి కళావతి, ఎల్లారెడ్డి పెట్ జడ్పీటిసి చీటీ లక్ష్మణ రావు, తంగాలపల్లి జడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి, గంభిరావు పెట్ జడ్పిటిసి కొమిరిశెట్టి విజయ లక్ష్మన్, బోయినిపల్లి జడ్పీటిసి కత్తెరపాక ఉమకొండయ్య, వేములవాడ రూరల్ జడ్పిటిసి వాణి, చందుర్తి జెడ్పిటిసి కుమార్, వేములవాడ అర్బన్ జడ్పీటిసి మ్యాకల రవి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, అహ్మద్, మరియు ఎంపిపిలు జనగామ శరత్ రావు, చంద్రయ్య గౌడ్, పిల్లి రేణుక కిషన్, పడిగేల మానసరాజు, కరుణ, భూల సంతోష్, బండ మల్లేశం,

జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking