ఖమ్మం ప్రతినిధి జనవరి19 (ప్రజాబలం) హైదరాబాద్ ప్రగతిభవన్ లో గురువారం సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను సక్సెస్ చేయడంలో కృషి చేసిన మంత్రి, ఎంపీ రవిచంద్ర ను ప్రశంసించారు. వీరితో పాటు సభ నిర్వహణ కోసం సమిష్టిగా పని చేసిన జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులను కూడా సీఎం అభినందించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాగే టీమ్ వర్క్ కొనసాగించాలని కేసీఆర్ సూచించారు.