విడుదల చేసిన తెలంగాణ పూర్వ కార్యదర్శి ఎస్ కే జోషి
“నా ఓటు నా ఆయుధం” అనే పాట ను విడుదల చేసిన తెలంగాణ పూర్వ కార్యదర్శి ఎస్ కే జోషి. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనదని ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం అందరి బాధ్యత అని జోషి తెలిపారు. ఓటు విలువను తెలియజేస్తూ పాట మూల రచయిత జివి రావు ను పాటకు సాహిత్య అందించిన సుద్దాల అశోక్ తేజను పాటలు పాడిన గాయకుడు రామ్ కి అభినందించారు.ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఓటు మాకు కీలకమైందన్న గమనించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల మత, లింగ, వర్ణబేదాలకు తావు లేకుండా అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించార న్నారు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగే వరకు కూడా
యూకే లో మహిళలకు ఓటుహక్కుకల్పించలేదన్నారు.స్వాతంత్ర భారతoలో మొదటినుండి ఓటు హక్కు ప్రాధాన్యతను కల్పించారన్నారు. కీలకమైన ఈ ఓటు హక్కును అమ్ముకోకుండా ఆయుధంగావాడాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా,మాజీ డీజీ దేశ్ ముఖ్, తెలంగాణ డెవలపర్స్ జీవి రావు తదితరులు పాల్గొన్నారు.