సిఎంఆర్ బియ్యం లక్ష్యం మేరకు అందించాలి అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 4 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా  అదనపు కలెక్టర్, కల్లూరు లోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కల్లూరు లోని విజయ శ్రీ రైస్ మిల్, రామకృష్ణ రైస్ మిల్లులలో అదనపు కలెక్టర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రబి సీజన్లో రైస్ మిల్లులకు సరఫరా చేసిన ధాన్యాన్ని రైస్ ఆడించి ఎఫ్సిఐ గోడౌన్లకు తరలించాల్సి ఉందన్నారు. కానీ లక్ష్యం సాధించక, ఇంకా కొంత బియ్యం పెండింగ్లో ఉండడం వల్ల వారిని వెంటనే ధాన్యాన్ని ఆడించి రైస్ ను ఎఫ్సిఐ గోడౌన్లకు తరలించాలని మిల్లర్లకు సూచించారు అదనపు కలెక్టర్ తనిఖీ సందర్భంగా పౌరసరఫరాల డిటి సత్య నారాయణ  సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking