వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 4 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని పలు డివిజన్ లలో రూ. 1.77 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా 25వ డివిజన్ రిక్కా బజార్, గాంధీ పార్క్ వద్ద ఎల్ఆర్ఎస్ నిధులు రూ.18లక్షలుతో సిసి రోడ్లు, 22వ డివిజన్ పాకబండ, గణేష్ గుడి వద్ద రూ.12లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. రూ.20 లక్షల సుడా నిధులతో నిర్మించిన సీసీ రోడ్స్, 23వ డివిజన్ ఎస్పీ ఆఫీస్ రోడ్ వద్ద 15వ ఆర్ధిక ప్రణాళిక నిధులు రూ. 37లక్షలతో నిర్మించిన పాకబండ పార్క్ ను ఆయన ప్రారంభించారు. రూ.20 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్ల, 34వ డివిజన్ రంగనాయకుల గుట్ట వద్ద ఎస్డీఎఫ్ నిధులు రూ.70 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లు & డ్రెయిన్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి, రూ.20 లక్షల సుడా నిధులతో నిర్మించిన సీసీ రోడ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం నగరంలో దాదాపు అన్ని రోడ్లు, కాల్వలు పూర్తి చేయడం జరిగిందని, ఇంకా మిగిలి ఉన్న అరకొర పనులు, కొనసాగుతున్న డ్రైన్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ , ఖానాపురం హవేలీ అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ది చేసుకున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్స్, అంతర్గత సీసీ డ్రైన్స్, ప్రధాన రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొత్తగా అన్ని ప్రాంతాల్లో కొత్త పార్కులు, ఉన్న పాత పార్కుల అభివృద్ది చేసి అందులో అన్ని మౌళిక సదుపాయాలు, ఓపెన్ జిమ్ లతో పాటు అన్ని వసతులు సమకూర్చామన్నారు. అస్థవ్యస్తంగా ఉన్న నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని మంత్రి అన్నారు. ఖమ్మం నగరాభివృద్ది కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు, ప్రజా అవసరాల కోసం అన్ని పనులు చేయడం జరిగినట్లు ఆయన తెలిపారు. ఎమ్మేల్యే గా ఎన్నికైన నాటి నుండి ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కో పని చేస్తు అవసరమైన నిధులు ప్రభుత్వం నుండి తీసుకొస్తూ ఆయా పనులు పూర్తి చేశామన్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలతో ఖమ్మం పోటీ పడుతున్నట్లు, అభివృద్ధిలో ఇంకా పోటీపడనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అభివృద్ది క్రమ వరుసలో చిట్ట చివర ఉన్న ఖమ్మం నేడు అగ్ర వరుసలో నిలిపామని, అనేక జిల్లాలు, అనేక మున్సిపాలిటీ లు ఖమ్మం ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి తెలిపారు. ఇక్కడ జరిగిన అభివృద్దిని పక్క రాష్ట్రాల నియోజకవర్గాలు కూడా అచరిస్తున్నయని అంతటి ప్రగతి అతి తక్కువ కాలంలో జరిగింది అనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన పార్కుల నిర్మాణం కోసం ప్రత్యేక కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి మ్యాన్ ఆఫ్ డి పార్క్స్ గా మంచి పేరు సాధించారని అన్నారు. హైద్రాబాద్ తరువాత ఉన్న వరంగల్, కరీంనగర్ మున్సిపాలిటీ లను పక్కకు నెట్టి హైద్రాబాద్ తరువాత రెండవ స్థానం ఖమ్మం మున్సిపాలిటీ అద్భుత ప్రగతితో సాధించిందన్నారు. రానున్న రోజుల్లో ఖమ్మం ను రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలిపేందుకు నా బాధ్యతగా పని చేస్తానని మంత్రి అన్నారు ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఇఇ కృష్ణ లాల్, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, గోళ్ళ చంద్రకళ వెంకట్, మక్బూల్, పల్లా రోజ్ లీన, రుద్రగాని శ్రీదేవి, తోట ఉమా వీరభద్రం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking