చదువులు పూర్తైన తరువాత నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలి

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ
నల్లగొండ అక్టోబర్ 4;నల్లగొండ పట్టణంలోని చిలుకూరి వెంకటేశ్వర్లు, కృష్ణవేణి దంపతుల తేజస్వి, వి క్రాంతి, మోహన్ దీప్, ముగ్గురు పిల్లలకు ఉచిత ప్రభుత్వ ఎంబిబిఎస్ సీట్లు లభించడంతో వారిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలోని పద్మశాలి భవన్లో ఘనంగా సన్మానం చేశారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎంతో కష్టమైన ఎంబీబీఎస్ సీట్లను కష్టపడి చదివి విజయం సాధించిన పిల్లలను వారి తల్లిదండ్రుల సహకారంతో ఉన్నతంగా చదివిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తల్లిదండ్రులను పిల్లలను పూలదండలతో శాలలతో సన్మానం చేశారు. పద్మశాలి పిల్లలు విజయ పదంలో దూసుకు వెళ్తున్నందుకు వారికి పద్మశాలి సంఘం అధ్యక్షులు సిరిపోలు వెంకటపతి సన్మానం చేశారు.నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉప అధ్యక్షులు మిర్యాల యాదగిరి తెలియజేశారు.బీసీ పిల్లలకు ఉచిత ఎంబీబీఎస్ సీట్లు రావడం ఆనందదాయకమని నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే పర్వతాలు బిసి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ ఎస్ పి టి మార్కెట్ చైర్మన్ మార్కెట్ అధ్యక్షులు మిరియాల సోమయ్య సోమయ్య ముది మత్స్యకారుల సొసైటీ రాష్ట్ర నాయకులు యాదగిరి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకన్న రామదాసు మిర్యాల సిరంశెట్టి రమేష్ మిర్యాల ధనుంజయ మహిళా బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి కర్నాటి యాదగిరి మార్గం సతీష్ కుమార్ వల్ల కీర్తి శ్రీనివాస్ ఆకారం ఉపేందర్ చిలుకూరి వెంకటేశం సిరిపోలు రాధాకృష్ణ పోశం రామదాసు చిలుకూరి రాములు నల్గొండ డిఐజి సోమేశ్వర్ సూర్యాపేట సురేందర్ భువనగిరి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వల్ల కీర్తి శ్రీనివాస్ చిట్ఫండ్ బిక్షమయ్య బొజ్జ దుర్గా య్య చిలుకూరి శ్రీనివాస్ రుద్ర లక్ష్మీనారాయణ చారి కల్లూరి సత్య గౌడ్ కృష్ణ పగిళ్ల కృష్ణ కంది సూర్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం సభ్యులు, నాయకులు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, చిలుకూరి వెంకటేశ్వర్లు సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking