టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనుల పై కలెక్టర్ సమీక్ష

 

నిర్ణీత గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 19:
టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులలో ఏవైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పనులలో తత్సారం ఉండకూడదని, నిర్ణీత గడువులో గా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు, సంబంధిత అధికారులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం సూచించారు.
సోమవారం అల్వాల్ లోని టిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నిర్మాణ పనుల పురోగతి పై సమీక్షా సమావేశానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులలో ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అన్నారు. అసుపత్రి పనుల పురోగతి పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంబంధిత కాంట్రాక్టరు కలెక్టరు వివరించారు.

90 శాతం పనులు పూర్తయ్యాయని ఇంకొకరెండు నెలలో మిగిత నిర్మాణ పనులు పూర్తవుతాయని, కొన్ని చోట్ల రీ డిజైన్ వలన కొంత అదనపు నిధులు అవసరమవుతున్నాయని కాంట్రాక్టర్ కలెక్టరుకు వివరించారు. చట్టబద్ధమైన ఆమోదాలు అటవీశాఖ,ఎ ఎ ఐ, పర్యావరణ అనుమతి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డునిర్మాణానికి ఎన్ ఓ సి జారీ, నిర్మాణం కోసం విద్యుత్ మరియు నీటి కనెక్షన్ పొందబడింది. కాలుష్య నియంత్రణ బోర్డు స్థాపనకు సమ్మతిని జారీ చేసిందని సంబంధిత అధికారులు కలెక్టరుకు వివరించారు. అదేవిధంగాఈ ఆసుపత్రిలో టీచింగ్ ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీలు కూడా నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో ఫర్నిచర్ ఏవిధంగా అందిస్తారని కలెక్టరు అడుడగా, అధునాతన పరికరాలైన మెడికల్ ఎక్విప్ మెంట్, ఆపరేషన్ థియేటర్లు నిర్మించేందుకు అగ్రిమెంట్ లో ఒప్పందం జరిగిందని అదేవిధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులు వివరించారు. కొన్ని అంశాలకు అవసరమైన డిఎంఎ అనుమతుల విషయంలో కలెక్టరు సంబంధిత అధికారులతో మాట్లాడుతానని కలెక్టరు తెలిపారు. ఎప్పటివరకు ఆసుపత్రి పనులు పూర్తి చేసి అప్పగిస్తారని కలెక్టరు అడుడగా, డిసంబరు 2025 నాటికి పూర్తి చేసి అప్పగిస్తామని కాంట్రాక్టరు తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బిఈఈ వనజ,ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డిఎంఅండ్ హెచ్ఓ ఉమాగౌరీ, అల్వాల్ తహాసీల్దారు రాములు, కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking