గుంతల మయం రోడ్డులను సరిచేయాలి.

నిర్మాణ వ్యర్థాల తొలగింపు చేపట్టాలి.
భూగర్భ జలాలు మెరుగుకై రోడ్డులపై ఇంకుడు గుంతలు కట్టాలి.
పందెం వాగుపై ఎస్.టి.పి.ని ఏర్పాటు చేయాలి.
అల్కాపూర్ రోడ్డును పుప్పాలగూడ బి.ఆర్.సీ వరకు కొనసాగించాలి.
ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానంలో సమ న్యాయం పాటించాలి.
రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 19 మే 2025
మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున అల్కాపూర్ టౌన్షిప్ స్వామి వివేకానంద పార్క్ దగ్గర నుంచి స్కాలర్ స్కూల్ మరియు పరిసర ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను లేవనెత్తారు. స్కాలర్ స్కూల్ ప్రాంత రోడ్డు మొత్తం గుంతల మయంగా అద్వానంగా తయారైన కారణంగా కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి లో నిర్మాణ వ్యర్థాలను తొలగించడానికి టోల్ ఫ్రీ నెంబరు రూపొందించి దాని ద్వారా రవాణా ఖర్చులు మొదలగునవి వసూలు చేసి పద్ధతి ప్రకారం నడుచు కుంటున్నారని తెలియ జేసి అదే విధంగా మణికొండ మున్సిపాలిటీ కూడా నిర్మాణ వ్యర్ధాల తొలగింపు చేపట్టొచ్చు కదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ? ఒకపక్క వేసవి కావడంతో నీటి కొరకు ఇబ్బంది పడుతుంటే కొంతమంది బాధ్యతారహితంగా కార్లను ఆటోలను మంచి నీటితో కడుగు తున్నారనీ వాపోయారు. నీటి సంరక్షణ కోసం రోడ్లపై ఇంకుడు గుంతలు నిర్మిస్తే కొంతలో కొంతమేరైనా భూగర్భ జలాలు మెరుగు పడతాయని స్థానికులు కోరుతున్నారు.

గతంలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వారు నిర్మించిన ఇంకుడు గుంతలు పూర్తిగా కనుమరుగై పోయాయనీ స్థానిక మున్సిపాలి అధికారులు చొరవ తీసుకొని భూగర్భ జలాల పరిరక్షణ కొరకు రోడ్లపై ఇంకుడు గుంతలు నిర్మించే పద్ధతిని చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పందెం వాగు ద్వారా ప్రవహిస్తున్న మురుగునీరు నిక్లాంపూర్ చెరువులో చేరకుండా మురుగునీరు మూసి వరకు ప్రవహించడానికి ఒక ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేయడం మరియు ఒక ఎస్.టి.పి.ని ఏర్పాటు చేసి మురుగు నీరు శుద్ధి నిర్వహణ చేపట్టాలని స్థానికులు బలంగా కోరుతున్నారు. అల్కాపూర్ టౌన్షిప్ నుంచి నార్సింగి మిలిటరీ రోడ్డును మరియు పుప్పాలగూడ కలిపే 100 ఫీట్ రోడ్లను మున్సిపాలిటీ చొరవ తీసుకోకపోవడం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రక్క ప్రభుత్వాలు డిజిటల్ ఇండియా డిజిటల్ చెల్లింపులు మొదలగునవి విస్తృతంగా ప్రచారం చేస్తూ రెండో ప్రక్క నగదు రూపంలో కాకుండా చెక్ పేమెంట్ ద్వారా చెల్లించి ఒకే రకమైన మరియు ఒకే ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఎక్కువ శాతం టాక్స్లువేయడం అన్నది, ప్రజల నిజాయితీని బొంద పెట్టడమే అని ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, ఉపేంద్రనాథ్ రెడ్డి, యాలాల కిరణ్ రాజేంద్ర ప్రసాద, షేక్ ఆరిఫ్, సుమ నళిని, చెరుకూరి బాలాజీ, ఆరిఫ్ మహమ్మద్, రమణమూర్తి మొదలగు వారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking