జిహెచ్ఎంసి వ్యాప్తంగా 179 విన్నపాలు
హైదరాబాద్, మే 19: ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నగర నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యల పై విన్నపాలను కమీషనర్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం కోసం సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ… ప్రజలు వ్యక్తిగత, సామాజిక సమస్యలను వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు వాటిని బాధ్యత తో పరిష్కరించాలని తెలిపారు. ఆర్థిక పరమైన అర్జీల పై క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు నిర్ణయం తీసుకున్నది, లేనిది సంబంధిత అర్జీదారునికి లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు.
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 66 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 33, ఇంజనీరింగ్ 6, ట్యాక్స్ సెక్షన్ 5, ఎలక్ట్రిక్, ల్యాండ్ అక్విజిషన్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, శానిటేషన్, హౌసింగ్, విజిలెన్స్ విభాగాలకు రెండు చొప్పున, హెల్త్, ఎస్టేట్, లేక్స్, యు.బి.డి విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందగా, ఫోన్ ఇన్ ద్వారా 4 ఫిర్యాదులు వచ్చాయి.
జిహెచ్ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 113 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 40, శేరిలింగంపల్లి జోన్ లో 14, ఎల్బీనగర్ జోన్ లో 9, సికింద్రాబాద్ జోన్ లో 17, చార్మినార్ జోన్ లో 3, ఖైరతాబాద్ జోన్ 30 ఆర్జీలు అందాయి.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ లు వేణు గోపాల్, పంకజ, గీతా రాధిక, నళిని పద్మావతి, రఘు ప్రసాద్, యాదగిరి రావు, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, సిసిపి శ్రీనివాస్, అడిషనల్ సిసిపి లు గంగాధర్, వెంకన్న, ఎల్.ఏ.ఓ రాము నాయక్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, హార్టికల్చర్ అధికారి సునంద, ఎలక్ట్రిసిటీ ఈఈ మమత, ఎస్టేట్ ఆఫీసర్ ఉమా ప్రకాష్, జలమండలి డీజీఎం సాయి రమణ, డిప్యూటీ సిఈ పనస రెడ్డి, పి వి రావు, హౌసింగ్ ఈ ఈ రాజేశ్వర రావు, జాయింట్ కమీషనర్ రెవెన్యూ మహేష్ కులకర్ణి, అడ్వర్టైజ్మెంట్ ఆఫీసర్ వెటర్నరీ పర్యవేక్షకులు శైలజ, మెయింటెనెన్స్ ఏ ఈ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.