అక్రమ బదిలీల సర్కులర్ ను తక్షణమే రద్దు చేయాలి

-ఐ.ఎన్.టి.యూ.సి నాయకుల డిమాండ్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మే 19:

సింగరేణిలో కార్మికుల బదిలీ కోసం ఇటీవల యాజమాన్యం విడుదల చేసిన సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలని ఐ ఎన్ టి యూ సి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ కేంద్ర కమిటి ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు, దేవి భూమయ్య, కేంద్ర కమిటి ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్ లు మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి సాధించడానికి కార్మికులంతా కలిసికట్టుగా కృషి చేస్తున్న ఈ సమయంలో కార్మికులను అక్రమ బదిలీలు చేసే విధంగా సర్కులర్ సింగరేణి యాజమాన్యం విడుదల చేసిందన్నారు. ఈ సర్కులర్ లో ఉన్న విధంగా బదిలీలు చేస్తే కార్మికులు మానసిక ఆందోళనకు గురై విధులు సరిగా నిర్వహించలేక బొగ్గు ఉత్పత్తి పడిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. సర్కులర్ రద్దు పై ఈనెల 12 న ఐ ఎన్ టి సి. యూ.సి సెక్రెటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో సి అండ్ ఎండిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. కార్మికుల బదిలీలపై అనేక నిబంధనలు చేరుస్తూ మోసపూరిత సర్కులర్ ను విడుదల చేయడం జరిగిందని వెంటనే ఈ సర్కులర్ ను రద్దు చేయని పక్షంలో ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈసమావేశంలో మిట్ట సూర్యనారాయణ, వెంకటస్వామి, ఓదెలు, వరుణ్, సదయ్య, తిరుపతి, రమేష్, స్వామి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking