రైతు నిరసన దీక్షలో పరకాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఇనుగాల వెంకట్రామరెడ్డి..
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 21:
ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 60 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఆదేశాల మేరకు గీసుగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం గీసుకొండ బస్టాండ్లో రైతు నిరసన దీక్షను రైతులతో కలిసి చేపట్టారు. ఈ నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన కొనయమాకులలో వడగండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న, టమాట, దొండ, కూరగాయల పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వడగండ్ల వానకు తీవ్రంగా దెబ్బతిన్న పంటతో రైతులు కోలుకోని రీతిలో నష్టపోయారని ఇంతవరకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించకపోవడం ప్రభుత్వానికి రైతాంగం పై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని అన్నారు. రైతులు ఎండనక వాననక, రాత్రనక పగలనక, ఆరు కాలం కష్టపడి, అప్పులు తెచ్చుకొని పంటలకు పెట్టుబడి పెట్టారని, ఇటీవల కురిసిన వడగండ్ల వానకు వేల రూపాయల నష్టం రైతులు చవిచూసారని ఆవేదన చెందారు. కేవలం గీసుకొండ మండలం లో 100 కోట్లకు పైగా పంట నష్టాన్ని రైతులు నష్టపోయారని ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయక చర్యలు లేకపోవడం అత్యంత దురదృష్టకరమని ఇది అసమర్థ పాలనకు నిదర్శనం అని అన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత సంవత్సరం పరకాల, నడికూడా మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చాడని అది నేటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. రైతు వ్యతిరేక కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటికి రైతు రుణమాఫీ చేయలేదని కనీస మద్దతు ధర ప్రకటించక రైతులను గోస పెడుతున్నారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణమే అధికారులతో గీసుకొండ మండలంలో పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎక్కడికి అక్కడ గోరవ్ చేస్తూ రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ ఎంపీపీ భీమ గాని సౌజన్య, జిల్లా నాయకులు చాడ కొమరారెడ్డి, యూత్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్, సాయిల్ ప్రభాకర్, చెరుకుపల్లి సాంబ రెడ్డి, కరుణాకర్, ఎంపీటీసీలు బిక్షపతి, సారంగం, మని గోపాల్ స్వామి, రాంరెడ్డి, గొర్రె రాజు, ఎండి రహీం, వజ్ర రాజు, పీసల రాజు, చెవుల సారయ్య, వెంకటేష్, బదుర్ నాయక్, కేపీ రాజు, బాబురావు, శ్రీనివాస్, ప్రవీణ్ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.