అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ముధోల్ మండలంలోని రువ్వి, గన్నోర గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటను మంగళవారం ఏడిఏ ఇంద్రసేన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముధోల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని లోకేశ్వరం, తానుర్, ముధోల్, బాసర మండలాల్లోని 174 మంది రైతులకు చెందిన 270 ఎకరాల మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. నష్టపోయిన రైతుల వివరాలను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి అజ్మీర్ భాస్కర్, ఏఈఓ సిరాజ్, తదితరులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking