మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శివంపేట్ జెడ్ పి టి సి. నాయకులు పబ్బ మహేష్ గుప్తా వీరి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి మంగళవారం సంత ఉన్నందున అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మహానధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు.
శివంపేట్ మండల్ జెడ్పిటిసి పబ్బ మహేష్ అన్నదాన నిర్వాహకులుగా అన్నదాన కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగించారు. ఇకముందు ప్రజల కోరిక మేరకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించే క్రమంలో నేను ఎల్లవేళలా అండదండగా ఉంటానని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గోసన్పల్లి వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్ కోడిపాక నారాయణ గుప్తా,ఉప్పల నర్సింహులు గుప్తా, శ్రీనివాస్ గుప్తా, నీళ్ల ప్రవీణ్ గుప్త, నవీన్ గుప్తా, మాలే సంతోష్ కుమార్ గుప్తా, ఉప్పల అశోక్ గుప్తా, కోడిప్యాకా నాగరాజు,గుప్తా, ప్రవీణ్ గుప్తా, నేతి నాగేష్, గుప్తా, దేవత రాజులు, ప్రభాకర్ ఆర్యవైశ్య సంఘ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.