కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు పాటల పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా శనివారం జిల్లా కోర్టు ఆవరణలో బరు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి రఘునందన్ రావు, లింగంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో బాల్ బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించారు. న్యాయవాదులు ఏ,బి ,సి, డి ఇ ,ఎఫ్ ఆరు తీములుగా ఏర్పడి తలపడగా ఫైనల్ లో ఇ టీం vs సి లు మధ్య పోటీ జరుగాగ ఇ టీం విన్నర్ కాగా, సి టీం రన్నర్ గా నిలిచింది. ఇ టీములో గుడిపాటి సత్యం రెడ్డి, మాతంగి రవీందర్, డి ప్రవీణ్, యు మునిష్, పాలేటి శ్రీనివాస్, కే సురేష్, శ్రీధర్ రావు, మంద రవీందర్ లు ఉండగా,
సి టీంలో గుంటి మధు, ముప్పిడి శ్రీకాంత్ రెడ్డి, చిప్ప రాజేశం, మడిపల్లి రవి, సయ్యద్ ముబీన్, కొత్త ప్రకాష్, ఆరెల్లి రాములు, వి సతీష్ లు రన్నర్ గా నిలిచారు. ఎస్ జనార్దన్ గౌడ్, మద్దికుంట కిషన్ రావు, గొనేపెల్లి శ్రీనివాస్ గౌడ్, వేణుగోపాల్, కృష్ణ తదితర న్యాయవాదులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ కు ఇంఛార్జి లుగా జి సత్యం రెడ్డి, దాడి ఓంకార్, కొట్టే తిరుపతి వ్యవహరించారు. గెలిచిన టీములకు రిపబ్లిక్ డే నాడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బహుమతులు అందజేస్తారు.